MBNR: గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారించేందుకు HPV టీకా చాలా చక్కగా పనిచేస్తుందని మహబూబ్ నగర్ మేయర్ గుమ్మాల మమత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బుధవారం తన కూతురికి టీకా వేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అపోహాలు వీడి తప్పనిసరిగా హెచ్పీవీ టీకా వేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ రహిత సమాజం దిశగా అడుగులు వేద్దామన్నారు.