CTR: నగరి చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గ (పవర్లూమ్) కార్మికులకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా నగరి మున్సిపాలిటీ పుదిపేటలో కార్మికులను కలిసిన ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్, ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేసి పథకం గురించి కార్మికులకు వివరించారు.