• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఖైరతాబాద్ జోన్‌లో 35 పరీక్షా కేంద్రాలు

HYD: ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లను అధికారులు చురుగ్గా చేస్తున్నారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలో షేక్‌పేట, ఖైరతాబాద్ మండలాలు వస్తాయి. మొత్తం 9,193 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం 35 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8 ప్రభుత్వ పాఠశాలలు, 27 ప్రైవేటు పాఠశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

March 6, 2026 / 03:22 PM IST

‘పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం’

SDPT: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిర్మల్ రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొని మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో 3.వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు.

March 6, 2026 / 03:17 PM IST

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

SRPT: మునగాల మండలం ఆకు పాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వెంకటి శుక్రవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, వెంకటి మరణంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మృతులంతా అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

March 6, 2026 / 03:16 PM IST

BC హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డా.దివ్య, హెచ్‌ఈఓ వెంకట రమణ, ఎమ్ఎల్‌హెచ్‌పీ సతీశ్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి వైద్య సూచనలు అందించి ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

March 6, 2026 / 03:14 PM IST

ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం

KNR: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పొన్నం సునీత అనిల్ గౌడ్ ఎన్నికల హామీని నెరవేర్చారు. గ్రామానికి చెందిన కోలిపాక లక్ష్మి–భూమయ్య దంపతుల కుమార్తె అనూష వివాహానికి హాజరై “పొన్నం కానుక”గా రూ. 5,016 నగదు అందజేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ్రామంలో ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సహాయం అందించడం తన బాధ్యతగా కొనసాగిస్తా అన్నారు.

March 6, 2026 / 03:10 PM IST

యూపీఎస్సీలో సత్తా చాటిన షాద్‌నగర్ యువతి

RR: సివిల్ సర్వీసెస్‌లో షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఇంద్రార్చిత సత్తా చాటింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమె 739వ ర్యాంకు సాధించగా.. ఈ ఏడాది నిర్వహించిన పరీక్షల్లో 627వ ర్యాంకు సాధించింది. చిన్ననాటి నుంచే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదివిన ఆమె పట్టుదలతో ఈ విజయం సాధించింది.

March 6, 2026 / 03:05 PM IST

ఉరుమడ్ల అంగన్వాడీ కేంద్రంలో ‘అన్నప్రాసన’

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల, అంగన్వాడీ కేంద్రం-2లో శుక్రవారం అన్న ప్రాసన కార్యక్రమాన్ని సర్పంచ్, అంగన్వాడి మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ సాగర్ల భానుశ్రీ అంగన్వాడీ టీచర్ లలితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శిశువు పుట్టినప్పటి నుంచి ఆరు నెలలు వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాత తప్పకుండా అనుబంధ ఆహారం ఇవ్వాలని సూచించారు.

March 6, 2026 / 03:03 PM IST

ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో శ్రీమడేలేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజేంగి నందయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాల నిర్మాణం గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 6, 2026 / 03:03 PM IST

‘ఇంటర్ పరీక్షకు 5 మంది గైర్హాజరు’

PDPL: ధర్మారం మండల కేంద్రంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జువాలజీ, చరిత్ర పరీక్షకు ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారని చీఫ్ సూపరింటెండెంట్లు అనంత రామకృష్ణ, గీతా వాణి తెలిపారు. మొత్తం 383 మందికి 378 మంది హాజరయ్యారు. ప్రభుత్వ కళాశాలలో 268 మందికి 268 మంది హాజరయ్యారు. సాధన కళాశాలలో 115 మందికి 110 మంది హాజరు కాగా, 5 గురు గైర్హాజరయ్యారు.

March 6, 2026 / 03:02 PM IST

గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

NGKL: తెలకపల్లి మండలం పర్వతాపూర్‌లో నూతనంగా నిర్మించనున్న చెన్నరాయుడు గుడి నిర్మాణానికి శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చొరవ తీసుకొని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేరా శ్రీను పాల్గొన్నారు.

March 6, 2026 / 03:02 PM IST

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రారంభం

GDWL: 99 రోజులు..10 సూత్రాలు.. గద్వాల పట్టణ సమగ్రాభివృద్ధే మన లక్ష్యం అని మున్సిపల్ ఛైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని 30వ వార్డులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను ఆమె శ్రీకారం చుట్టారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం పట్టణ రూపురేఖలను మార్చడానికి ఒక పునాది కావాలన్నారు.

March 6, 2026 / 03:02 PM IST

మల్యాల కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

BHNG: బొమ్మలరామారం మండలంలోని మల్యాల కేజీబీవీ బాలికల పాఠశాలను కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రమాదేవి కలెక్టర్‌ను కలిసి బొమ్మలరామారం నుంచి మల్యాల వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆటోలు పాఠశాల వద్దకు రావడానికి నిరాకరిస్తున్నారని వివరించారు.

March 6, 2026 / 03:02 PM IST

కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని ధర్నా

NGKL: జిల్లాలోని కుమ్మెర బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర కమిటీ సభ్యులు రవికుమార్, డీజీ నరసింహారావు తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 6, 2026 / 03:01 PM IST

జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సంధ్యారాణి

HNK: తెలంగాణ బీసీ ప్రజా సంఘం హనుమకొండ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా సంధ్యారాణి నియమితులయ్యారు. ఈ మేరకు సంధ్యారాణికి బీసీ ప్రజా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయిని భరత్ నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లాలోని బీసీలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని నూతన అధ్యక్షురాలికి వ్యవస్థాపక అధ్యక్షుడు సూచించారు.

March 6, 2026 / 03:00 PM IST

ములుగు సమగ్ర అభివృద్ధికి కృషి: రవిచందర్

MLG: ములుగు మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్ అన్నారు. ములుగులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారని, ములుగు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

March 6, 2026 / 03:00 PM IST