KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య అధికారి డా.దివ్య, హెచ్ఈఓ వెంకట రమణ, ఎమ్ఎల్హెచ్పీ సతీశ్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన వారికి వైద్య సూచనలు అందించి ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని సూచించారు.