• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

TRS పార్టీ వేదికపై రేవంత్ రెడ్డి పాటకు స్టెప్పులు

మునగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటెస్ట్రింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో అధికార TRS పార్టీ ప్రచార సభలో… టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి పాటకు పలువురు డాన్స్ చేయడం చూడవచ్చు. మా అన్నా రేవంత్ అంటూ కొనసాగుతున్న పాటుకు వేదికపైనే అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్...

October 14, 2022 / 06:54 PM IST

మునుగోడులో ముగిసిన నామినేషన్ల పర్వం…!

మునుగోడు ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు స్వంతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు సమర్పించారు. చివరి రోజున కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ అభ్యర్ధిగా ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ పేరు ప్రతిపాదించినా.. కేఏ పాల్ నామినేషన్ ...

October 14, 2022 / 06:34 PM IST

రాహుల్ జోడోయాత్ర… హైదరాబాద్ లో ఎప్పుడంటే..?

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా జోడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా…. ఆయన జోడో యాత్ర ఈ నెల 23న తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టనుంది. కాగా… హైదరాబాద్ నగరంలోకి ఈ నెల 31వ తేదీన రాహుల్ గాంధీ అడుగుపెట్టనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మీడియాకు వివరించారు. ఈ నెల 23వ తేదీన క‌ర్ణాట‌క నుంచి కృష్ణా బ్రిడ్జి మీదుగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా మ‌క్త‌ల్ నియోజ...

October 14, 2022 / 01:10 PM IST

ఆ కంపెనీలకు ఆర్థిక సాయం..ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?

మంత్రి కేటీఆర్ తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గ్యాస్ సబ్సిడీని ఎత్తివేసి..కంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తారా అంటూ ఎద్దేవా చేశారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధర…ప్రస్తుతం 11 వందల రూపాయలు దాటి…ఇంక పెరుగుతూనే ఉందన్నారు. ఆయిల్ కంపెనీలకు కాదు…ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పేదలకు మళ్లీ కట్టెలపొయ్యి దిక్కయ్యి...

October 14, 2022 / 01:01 PM IST

కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్..కేంద్రం ఆమోదం

కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఈ కేబుల్ వంతెనను 1082 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. 30 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని…ఐకానిక్ బ్రిడ్జ్ రూపు రేఖ చిత్రాలను గడ్కరీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వంతెన దేశంలో మొదటిది కానుండగా…ప్రపంచంలో రెండోదిగా ...

October 14, 2022 / 12:52 PM IST

మునుగోడును దత్తత తీసుకుంటా…కేటీఆర్ బంపర్ ఆఫర్…!

మునుగోడు ఉప ఎన్నిక వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు నోటీఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. నోటిఫికేషన్ లు కూడా వేస్తున్నారు. ఈ క్రమంలో.. మంత్రి కేటీఆర్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపిస్తే తాను మునుగోడును దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు...

October 13, 2022 / 06:44 PM IST

మునుగోడులో నకిలీ ఓటర్లు… ఈసీకి బీజేపీ ఫిర్యాదు..!

మునుగోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటోంది. కాగా… తాజాగా.. మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో… బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ నాయకత్వంలో నేతలు ఈసీని కలిసారు. మునుగోడు ఓటర్ లిస్ట్లో టీఆర్ఎస్ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ నేతలు తమ ఫిర్యాద...

October 13, 2022 / 06:41 PM IST

హైదరాబాద్ లో నయా దందా..యువతలను వీడియో తీసి…..!

హైదరాబాద్ నగరంలో నయా దందా మొదలైంది. యువతులను టార్గెట్ చేసి…వారి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఏ అమ్మాయి ఎవరైనా అబ్బాయితో కనపడితే చాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనికంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓపేజీ కూడా తెరవడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండా-అఫీషియల్ అనే అధికారిక పేరుతో ఒక ముఠా ఏర్పడింది. ఓ వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తోంద...

October 13, 2022 / 04:27 PM IST

హైదరాబాద్‌ వరదల్లో కొట్టుకుపోయిన బైకర్!

హైదరాబాద్‌లో నిన్న దంచికొట్టిన వర్షానికి పలు చోట్ల పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరింది. మరోవైపు బోరబండలో భారీగా చెరిన వరద నీటిలో…ఓ వ్యక్తితో బైక్‌తో సహా జారీపడి కొంత దూరం వెళ్లాడు. ఆ క్రమంలో గమనించిన ఓ వ్యక్తి అతన్ని కాపాడగా…బైక్ మాత్రం నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో…ఆ ప్రాంతాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీర...

October 13, 2022 / 01:35 PM IST

వాళ్లు ఇబ్బందిపడుతున్నారు… కేటీఆర్ కి పవన్ రిక్వెస్ట్…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. స్కూల్ బస్సులేక కొందరు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని… వారి కోసం బస్సు సదుపాయం కల్పించాలని కోరుతూ పవన్ ట్వీట్ చేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల్లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. విద్యార్థుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి ముఖ్య...

October 12, 2022 / 06:44 PM IST

మునుగోడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్!

తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అభ్యర్థిగా జక్కలి ఐలయ్య యాదవ్ పేరు ఖరారు చేశారు. రేపు అధికారికంగా చంద్రబాబు నాయుడు అతని పేరును ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. ఇది కూడా చూడండి: మూడు రాజధానులు… ఏపీ ...

October 12, 2022 / 05:51 PM IST

హైదరాబాద్‌లో రూ.3.5 కోట్ల హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్లలో తీసుకెళ్తున్న హవాలా డబ్బుతోపాటు..మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో…ఆ నగదును ఇన్ కం ట్యాక్స్ అధికార...

October 11, 2022 / 06:37 PM IST

కోమటిరెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్…!

మునుగోడు ఎన్నికల హీట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అన్ని పార్టీల నేతలు అలర్ట్ అయ్యారు.ఈ క్రమంలో… బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కి మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు. మునుగోడు ఉప ఎన్నిక‌.. అక్ర‌మ కాంట్రాక్టుల‌తో రాజ‌గోపాల్ రెడ్డి సంపాదించిన ధ‌న బ‌లానికి, స్థానిక ప్ర‌జా బ‌లానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ అని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టుల కోస‌మే మునుగో...

October 11, 2022 / 02:53 PM IST

మునుగోడు ఎన్నికల వేళ…కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పు

మునుగోడు ఉపఎన్నికల వేళ చండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి దుండగులు నిప్పుపెట్టారు. దీంతో మునుగోడు ఉపఎన్నిక ప్రచారం కోసం సిద్ధం చేసిన జెండాలు, పోస్టర్లు దగ్ధమయ్యాయి. దాదాపు 5 లక్షల విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో కాంగ...

October 11, 2022 / 11:36 AM IST

HYDలో వర్షం…భయాందోళనలో ప్రజలు!

హైదరాబాద్‌లో వర్షం వస్తే చాలు…అనేక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయా ప్రాంతాలు మొత్తం వర్షం నీటితో నిండిపోతున్నాయి. మరికొన్ని లోతట్టు ప్రాంతాల్లోనేతే ఇళ్లలోకి నీరు చేరి అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. దీంతో ఇంట్లో సామాగ్రి తడిసి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ వర్షాలకు హైదరాబాద్‌లో పలు చోట్ల… రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. మొకాళ్ల వరకు నీరు చేరి నడిచే ప్రజలు స...

October 10, 2022 / 07:07 PM IST