హైదరాబాద్లో మరోసారి పెద్ద ఎత్తున హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 3.5 కోట్ల రూపాయలను హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అధికారులు నగదును గుర్తించారు. ఆ క్రమంలో రెండు కార్లలో తీసుకెళ్తున్న హవాలా డబ్బుతోపాటు..మరో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఆ నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపకపోవడంతో…ఆ నగదును ఇన్ కం ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికల వేళ భారీగా నగదు దొరకడం చర్చనీయాంశంగా మారింది.