AP: రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా ఉన్న హంద్రీనీవా పనులను విస్తరణ పేరుతో జగన్ రద్దు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విద్యుత్ మోటార్లకు చెల్లించాల్సిన బిల్లులను కూడా చెల్లించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే రూ.3,870 కోట్లతో హంద్రీనీవా పనులు ఏడాదిలో చేసి చూపించామని అన్నారు. రాయలసీమలో కృష్టా జలాలను పారించామని తెలిపారు.