WGL: నర్సంపేట మండలం గురజాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొల్లం అరుణ్‌ని బీజేపీ పార్టీ బలపరిచింది. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణాప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో ఆయనను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొంటూ బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అరుణ్ గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా గ్రామ నాయకులు తెలిపారు.