TG: కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు పేలిన ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. అడవి జంతువులను వేటాడడానికి తయారు చేసిన నాటు బాంబుని కొరికి కుక్క చనిపోయినట్లు వెల్లడించారు. దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయోద్దని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కాగా, రైల్వే స్టేషన్ పరిసరాల్లో పడేసిన నాటు బాంబు సంచిని కుక్క రైల్వే ట్రాక్ మీదకి తెచ్చిన విషయం తెలిసిందే.