MBNR: స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల రెండవ దశ నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయిని దేవి బుధవారం భూత్పూర్, మూసాపేట క్లస్టర్లను సందర్శించారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో సంబంధిత మండలాల అధికారులు పాల్గొన్నారు.