కృష్ణా: ఘంటసాలలో బుధవారం శాసన మండలి మాజీ చైర్మన్ పద్మభూషణ్ స్వర్గీయ గొట్టిపాటి బ్రహ్మయ్య 127వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేడీసీసీ బ్యాంకులో బ్రహ్మయ్య విగ్రహానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి వెంకట రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.