WGL: ఈనెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణాప్రతాప్ తెలిపారు. హిందూ దేవతలపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. NSPTలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం క్షమాపణలు చెప్పిన తర్వాతే నర్సంపేటలో అడుగుపెట్టాలని, లేదంటే పర్యటన అడ్డుకుంటామన్నారు.