W.G: పెనుమంట్ర (M) వెలగలేరు గ్రామపంచాయతీ పరిధిలోని మార్టేరు బ్రాహ్మణ చెరువు ప్రధాన రహదారిపై నిల్వ చేసిన ధాన్యం రాశులను కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ.. గోనెసంచుల నాణ్యత, ధాన్యం రవాణా సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, రైతు సేవా కేంద్రాల పనితీరు, అధికారుల అందుబాటు సేవలు పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.