భారత్‌పై బంగ్లా ఆర్మీ మాజీ జనరల్ అబ్దుల్లాహిల్ ఆజ్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ముక్కలు అవ్వనంత వరకు బంగ్లాలో శాంతి నెలకొనదన్నారు. తాత్కాలిక ప్రభుత్వంతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని భారత్ ప్రయత్నిస్తున్న వేళ ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో బంగ్లా విముక్తికి భారత్ చేసిన సాయాన్ని మరిచి ఆజ్మీ మాట్లాడటం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు.