ADB: యావత్ రైతాంగం తీవ్ర సమస్యల్లో ఉంటే CM రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆటపై కోచింగ్ తీసుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొప్పలు చెప్పి తెలంగాణ ప్రజలను తిప్పలు పెడుతున్న సీఎం రేవంత్ ఆదిలాబాద్ పర్యటన అర్థరహితమని ఎద్దేవా చేశారు.