కృష్ణా: మచిలీపట్నం మండలంలోని వైజేఆర్డీఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల 5న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ టి. రవికుమార్ మాట్లాడుతూ.. 2024-25 ఉత్తీర్ణులైనవారితో పాటు పూర్వ ఉత్తీర్ణులైనవారూ పాల్గొనవచ్చని, ఉదయం 8 గంటల నుంచి పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, కలెక్టర్ డీకే బాలాజీ హాజరువుతారని పేర్కొన్నారు.