ప్రకాశం: కంభం(M) తురిమెళ్ళలో జాతీయ ఆహార భద్రత, పోషణ మిషన్ కింద పంట కోతల అనంతరం వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు అనే అంశంపై బుధవారం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మానస హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట కోతల అనంతరం రైతులు అనుసరించాల్సిన పద్ధతులను గురించి వివరించారు.