రాయ్పూర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ (102), రుతురాజ్ గైక్వాడ్ (105) సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (66*) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ 2 వికెట్లు తీశాడు.