VSP: గాజువాకలో అవినీతి నిరోధక శాఖ (ACB) మంగళవారం నిర్వహించిన దాడిలో అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ (ASO) కృష్ణ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ వ్యక్తి నుంచి పది వేల రూపాయలు తీసుకునే సమయంలోనే అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.