NZB: ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ T. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఆలూర్ మండలం గుత్ప గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ ఫారంలు, రిజిస్టర్లను పరిశీలించారు.