KMM: పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే 5 సుత్రాలు పాటించాలని డాక్టర్ కేవీ కృష్ణారావు అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లి గురుకులంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సమతుల్య ఆహారం, ప్రశాంతమైన నిద్ర, శారీరక శ్రమ, పరిశుభ్రత, వినోదం తప్పనిసరి అని చెప్పారు. అటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.