MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని నిజాంపేట తహశీల్దార్ శ్రీనివాస్ అన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ పదవులకు నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారాలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.