రూపాయి మారకపు విలువ ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోవటంపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువ రూ.90కి చేరటంపై ప్రభుత్వం ఆందోళనేమీ చెందటం లేదని తెలిపారు. దీనివల్ల అటు ద్రవ్వోల్బణంపై గానీ, ఎగుమతులపై గానీ ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది పరిస్థితి మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు.