ADB: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కశ్యప్ పటాస్కర్ ప్రతిష్టాత్మక విజయ్ మర్చెంట్ ట్రోఫీ (అండర్–16) కి వరుసగా రెండోసారి ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు కర్ణాటకలోని శివమొగ్గలో జరగనుంది. విజయ్ మర్చంట్ ట్రోఫీకి ఎంపిక కావడం పట్ల శిక్షకుడు జయేంద్ర పటాస్కర్, తదితరులు కశ్యప్‌కు అభినందనలు తెలిపారు.