ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదని యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల దౌత్యవేత్తలు ఓ జాతీయ పత్రికకు వ్యాసం రాశారు. రష్యా కావాలనే యుద్ధాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మాస్కో సైబర్ దాడులు చేసి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. శాంతి చర్చలను పుతిన్ కావాలనే వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.