VZM: ఉపాధి హామీ పనులు పారదర్శకంగా నిర్వహించాలని డ్వామా పీడీ శారదాదేవి పేర్కొన్నారు. సారిపల్లి పంచాయతీ పరిధి కుదిపి గ్రామంలో ఉపాధి పనులను ఆమె బుధవారం పరిశీలించారు. రెండు పూటలు పనులు చేపడితే వేతనం గిట్టుబాటు అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె పనులు పురోగతి, కూలీల హాజరు, పనిలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.