MDK: రామాయంపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్కూటినీ ప్రక్రియను జిల్లా సాధారణ పరిశీలకురాలు భారతీ లక్పతి నాయక్ సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో పరిశీలించారు. ప్రతి నామినేషన్ పత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించి, నియమ నిబంధనలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె రిటర్నింగ్ అధికారులకు సూచించారు.