TG: హిందువులపై మాట్లాడిన రేవంత్ రెడ్డికి.. ఇతర మతాల గురించి మాట్లాడే దమ్ము ఉందా..? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఇతర మతాల గురించి మాట్లాడేటప్పుడు.. ముస్లింలు అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలు అని అన్నారన్నారు. కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటారని సీఎం వ్యాఖ్యానించారని విమర్శించారు. కానీ హిందువులపై మాత్రమే వెటకారంగా మాట్లాడుతారని మండిపడ్డారు.