TG: హిందువులను, హిందూమతాన్ని అవమానించవద్దని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూచించారు. గతంలో కూడా కేసీఆర్ హిందువులను అవమానించేలా మాట్లాడారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి వెంటనే.. హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులపై వెటకారంగా మాట్లాడితే.. ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. వేరే మతాన్ని పొగడండి.. కానీ హిందూమతాన్ని మాత్రం కించపరచొద్దు అని హితవు పలికారు.