SKLM: ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని CITU జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. బుధవారం రణస్థలంలో ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ పథకంలో గత 19 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లగా విధులు నిర్వహిస్తున్న ఉపాధి కూలీలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు.