MBNR: జడ్చర్ల మాజీ సర్పంచ్ చింతకాయల పెంటయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.