TG: ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లకుండా భూభారతిని తయారు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 9 లక్షల ఫిర్యాదుల్లో న్యాయపరమైనవి పరిష్కరించామని వివరించారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ధరణిలో ఉన్న అనేక సీక్రెట్ లాకర్లను ఓపెన్ చేశామని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరించామని చెప్పారు.