TG: భూభారతిలో చెప్పిన విధంగా భూధార్ కార్డులు సిద్ధం చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత భూధార్ కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు. 5 రెవెన్యూ గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నామన్నారు. అభద్రతతో ఉన్న రైతులకు భూభారతి ద్వారా భద్రత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.