HYD: నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో సుమారుగా 70 ఎకరాల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ప్లాస్టిక్, మెటల్, ఫార్మా సహా అనేక కంపెనీలు ఉండగా వీటి నుంచి వందల వేల లీటర్ల వ్యర్ధాలు విడుదలవుతున్నాయి. ఈ వ్యర్ధాలను బోడుప్పల్ పరిధిలోని ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేయాలి. కాగా, 700ల కంపెనీల్లో 200 మాత్రమే ఈ నిబంధనలు పాటిస్తున్నాయి.