బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమా కథకు, అమరుడైన మేజర్ మోహిత్ శర్మ జీవితానికి సంబంధం లేదని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సినిమాను పునఃపరిశీలించిన CBFC.. ఈ మూవీ కథ కల్పితమని తెలిపింది. అనుమతి లేకుండా తమ కుమారుడి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారని మోహిత్ తల్లిదండ్రులు ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.