MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుందిం. రామాయంపేట మండలంలో సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల మధ్య పోటీ నెలకొంది. ఝాన్సీలింగాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానానికి మానెగళ్ళ రామకృష్ణయ్య నామినేషన్ వేయగా, కొడుకు వెంకటేష్ కూడా అదే పదవికి నామినేషన్ వేశాడు. కాగా, 1563 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో సర్పంచ్ స్థానానికి 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి.