సంచార్ సాథీ యాప్‌పై కేంద్రం వెనక్కి తగ్గింది. ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల దేశంలోని ఫోన్లలో ఈ యాప్ తప్పనిసరి చేస్తూ మొబైల్ తయారీదారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయం వల్ల యూజర్ల ఫైవసీ దెబ్బతిట్టుదంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్న వేళ కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.