సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. రుతురాజ్ గైక్వాడ్ (51*), విరాట్ కోహ్లీ (50*) హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో 24.3 ఓవర్లకు టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (14), జైస్వాల్ (22) రన్స్ చేశారు.