KNR: మహాత్మా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. కొందరు విద్యార్థులు పాఠాలు సరిగ్గా చదవకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.