E.G: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిడదవోలు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్తానిక గణపతి సెంటర్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడారు. రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరంగా విభిన్న ప్రతిభావంతులు ఉన్నత శిఖరాలకు చేరుకొనేలా సమాజం ప్రోత్సహించాలన్నారు.