కృష్ణా: కురుమద్దాలి గ్రామంలో కూటమి నేతలు నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు మినువుల విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొలుగొను సమయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తమ విధులు నిర్వహించాలని సూచించారు.