KMR: గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ నాయకులు కోరారు. బుధవారం వారు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంకు వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ నాయకుడు సంజయ్ మాట్లాడుతూ.. కళాశాలలో కనీస సౌకర్యాలు లేక, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూత్రశాలల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు.