నటసింహం బాలకృష్ణతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ 2’. ఈ నెల 5న ఇది రిలీజ్ కానుంది. ఈ సినిమా ముందు భారీ టార్గెట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.114 కోట్లు జరిగిందట. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.116 కోట్లకు పైగా వసూళ్లు సాధించాల్సి ఉంది. మరోవైపు ఈ మూవీ ఈజీగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.