NLG: అనుముల మండలం పేరూరు గ్రామ పంచాయతీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వు కావడం, గ్రామంలో ఎస్టీ మహిళలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులు ఎస్టీలకు కేటాయించడంతో,గ్రామంలోని అన్ని పార్టీల నేతలు కలిసికట్టుగా ఈ ఎన్నికలను బహిష్కరించారు.