AP: ఉద్భవ్-2025 అనేది కేవలం వేడుక మాత్రమే కాదని మంత్రి సంధ్యారాణి అన్నారు. విద్యార్థుల ప్రతిభ, సృజన, నైపుణ్యాలను వెలుగులోకి తెచ్చే వేదికని చెప్పారు. రాష్ట్రంలోని 28 పాఠశాలల నుంచి 110 ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులు వేడుకల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోటీల్లో విజయం సాధించడం కంటే కూడా ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటడమే ఈ వేడుకల లక్ష్యమని వెల్లడించారు.