W.G: బాలికలకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహాలు చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ కే. శ్రీదేవి అన్నారు. బుధవారం మారంపల్లి జడ్పీహెచ్ పాఠశాలలో బాల్య వివాహాలు నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల వివాహం జీవితం, గర్భస్థ దశపై బాలికలకు కనీస అవగాహన ఉండదన్నారు. దీంతో గర్భం దాల్చిన సందర్భంలో శారీరిక సమస్యలు వస్తాయన్నారు.