AP: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరికీ తీసిపోమంటూ విభిన్న ప్రతిభావంతులు విజయవాలు సాధిస్తున్నారని చెప్పారు. యువ క్రికెటర్ కరుణకుమారి చూపిన ప్రతిభ నిదర్శనమని కొనియాడారు. అలాగే, దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారికి టీడీపీ అండగా నిలుస్తోందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.