TG: వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్దేముల్ మండలం గొట్లపల్లి పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే డేటా స్కాన్ చేసి ఉంచామని అధికారులు చెబుతున్నారు.