JN: పాలకుర్తి మండలంలో 3వ విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మండలంలోని నామినేషన్ కేంద్రాలను DCP రాజమహేంద్ర నాయక్ సందర్శించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ACP నర్సయ్య పాల్గొన్నారు.