సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో డికాక్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (14) వెనుదిరిగాడు. యాన్సన్ బౌలింగ్‌లో బాష్‌కు క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (22) పెవిలియన్ చేరాడు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 66 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (13*), రుతురాజ్ (4*) పరుగులతో ఉన్నారు.